మల్కాజ్‌గిరి ప్రజలకు గుడ్ న్యూస్.. 22-A సమస్యపై ఎమ్మెల్యే కీలక భేటీ.|

0
19

హైదరాబాద్ : నాంపల్లి రిజిస్ట్రేషన్ భవన్‌లో జాయింట్ ఐజీ & డీఐజీ మధుసూదన్ రెడ్డిని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి కీలక సమస్యలను వివరించారు.

వల్లభ్ నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని అల్వాల్‌కు మార్చాలని విజ్ఞప్తి చేయడంతో పాటు, మల్కాజ్‌గిరి పరిధిలో వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్స్ కారణంగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ల సమస్యపై చర్చించారు. సర్వే నంబర్లు 3, 103-105, 144-154 వరకు ఉన్న భూములు చట్టబద్ధమైనవేనని అన్ని ఆధారాలు ఉన్నాయని ఎమ్మెల్యే వివరించారు.

ఈ భూములు ఉప్పల్ మండలం మల్లాపూర్‌కు చెందినవని, అయినప్పటికీ 22-A జాబితాలో చేర్చడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ఈ సర్వే నంబర్లను 22-A నుంచి తొలగించాలని కోరగా, సమస్యను పరిశీలించి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.

ఈ చర్యలతో మల్కాజ్‌గిరి ప్రజల ఆస్తి సమస్యలు పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడింది.

#sidhumaroju

Alwal