మదనపల్లెలో సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ‘బ్లాక్ డే’ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కోశాధికారి
టి. హరిశర్మ, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ, కార్మికులకు నష్టం కలిగించే లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, కనీస వేతనం రూ. 30 వేలుగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్మికుల హక్కుల పరిరక్షణకు ఉద్దేశించబడింది.










