చీరాల పట్టణంలో దర్బార్ రోడ్డు లోని ఐస్ మ్యాజిక్ వద్ద విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించిన శక్తి టీం పోలీసులు. ఈ సందర్భంగా శక్తి టీం సభ్యురాలు సిహెచ్ సునీత విద్యార్థులకు శక్తి యాప్ గురించి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో తెలియపరచి ఆపద సమయంలో శక్తి హెల్ప్ లైన్ నంబర్స్ 112,1098,181, గురించి తెలియపరచి,
విద్యార్థులకు ప్రస్తుతం జరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్స్, హెల్మెట్ పెట్టుకోకపోతే జరిగే ఆక్సిడెంట్స్ గురించి,18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తప్పనిసరి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని తెలియపరిచారు. యువత బెట్టింగ్ యాప్స్ కి బానిసలు అవుతున్నారని బెట్టింగ్ యాప్స్ కి దూరంగా ఉండాలని వాటి వల్ల జరిగే నష్టాల గురించి వివరించారు. అవగాహన సదస్సు నిర్వహించినందుకు విద్యార్థులు పోలీసు వారికి ధన్యవాదాలు తెలిపినారు.










