పార్లమెంట్ లో అమరావతి బిల్లు ఆమోదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం
• పార్లమెంట్లో ఏపీ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు-2026 ఏకగ్రీవంగా ఆమోదం పొందడం చారిత్రాత్మకం.
• ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరింది.. అమరావతికి లభించిన ఈ గౌరవం ప్రతీ ఆంధ్రుడికి గర్వకారణం.
• ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు.. అమరావతి ప్రస్థానంలో ప్రతీ అడుగులో ప్రధాని అండగా నిలిచారు
• 2015లో రాజధానికి శంకుస్థాపన, 2025లో పునర్నిర్మాణం… ప్రధాని మోదీ చేతుల మీదుగానే జరిగింది.
• కేంద్ర ప్రభుత్వం సహా హోంమంత్రి అమిత్ షా పూర్తిగా సహకరించారు.
• పార్లమెంటులో ఈ బల్లుకు సహకరించిన అన్ని రాజకీయ పార్టీలకు ధన్యవాదాలు.
• ఈ విజయం అమరావతి రైతులకు అంకితం.
• రాజధాని కోసం వారు చేసిన త్యాగం, చూపిన పట్టుదల మరువలేనివి.
• అమరావతి ఇక ఆంధ్రులకు ఏకైక ప్రజా రాజధాని.
• రాజధానిపై ఇక ఎలాంటి అనుమానాలకు, చర్చలకు తావులేదు.
• రాష్ట్ర విభజన తర్వాత ఎదుర్కొన్న చీకటి రోజులకు ఇది ముగింపు.
• ఏపీ ప్రగతికి ఈ నిర్ణయం కొత్త నాంది.
• ఏపీకి గుండె, ఆత్మ అయిన అమరావతి ఇక అన్స్టాపబుల్.
• దేశానికే అద్వితీయమైన భవిష్యత్ నగరంగా అమరావతి నిలుస్తుంది.
• అమరావతి సుస్థిరతతో నూతన శకం ప్రారంభమైంది.










