మదనపల్లెలో రోడ్డు ప్రమాదం – ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు.

0
1

ఆటో రిపేర్ కోసం మదనపల్లెకు వచ్చిన ఆటో డ్రైవర్ వెంకటరమణ (60) శుక్రవారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. బి. కొత్తకోటకు చెందిన వెంకటరమణ, ఆటో మరమ్మత్తు కోసం స్పేర్ పార్ట్స్ తీసుకుని బైక్‌పై మదనపల్లెకు వచ్చాడు.

సిటిఎం రోడ్డులో రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొనడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.