రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించినందుకు గురువారం బొబ్బిలి ఎంపీడీఓ కార్యాలయంలో ఉద్యోగులు సంబరాలు నిర్వహించారు. అమరావతి రాజధాని ప్రకటించడంతో ఎంపీడీఓ కార్యాలయంలో ముగ్గులు వేసి కార్యాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు.
రాష్ట్ర రాజధానిగా అమరావతి ప్రకటించడం ఆనందంగా ఉందని ఎంపీడీఓ రవికుమార్ అన్నారు. కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొన్నారు.
#RAJESH










