బీసీల న్యాయమైన హక్కుల సాధనకై బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఏప్రిల్ 11వ తేదీ నుండి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.
మంగళగిరిలోని బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయంలోని పూలే మండల్ వేదికగా ఈ దీక్ష జరుగుతుంది. బీసీ సింహ గర్జన సభలో ప్రభుత్వం ముందు ఉంచిన ఐదు కీలక డిమాండ్లకు ఇచ్చిన గడువు ముగిసినా ప్రభుత్వం నుండి స్పందన రాకపోవడంతో రామచంద్ర యాదవ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి# కొత్తూరు మురళి .










