ఎమ్మిగనూరులో ఘనంగా క్షేత్రస్థాయి వేడుకలు నిర్వహించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతికి పార్లమెంట్ వేదికగా చట్టబద్ధత లభించడం 5 కోట్ల ఆంధ్రుల కల నెరవేరిన చారిత్రాత్మక ఘట్టంగా ఎమ్మిగనూరులో ఘనంగా వేడుకలు నిర్వహించారు. రాజధాని నిర్మాణం కోసం భూములు సమర్పించిన రైతుల మహా త్యాగాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ విజయాన్ని ఊరూరా పండుగలా జరుపుకున్నారు.
అమరావతిని కేంద్రంగా చేసుకుని రాష్ట్రంలోని 26 జిల్లాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలన్న కూటమి ప్రభుత్వ దృఢ సంకల్పాన్ని ప్రతి గడపకు చేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షగా నాయకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయం నుంచి జాతీయ జెండాలతో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం పద్మశ్రీ మాచాని సోమప్ప కూడలిలో బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.










