మదనపల్లిలో జువెలరీస్ మోసం: కేసు నమోదు.

0
4

మదనపల్లెలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న మణప్పురం రితు జువెలరీస్‌లో జరిగిన మోసంపై పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ దీరజ్ ఆదేశాల మేరకు వన్‌టౌన్ సీఐ రాజారెడ్డి, మేనేజర్ సూరజ్‌పై చీటింగ్ కేసు గురువారం నమోదు చేశారు.

తక్కువ ధరకే బంగారం ఇస్తామని నమ్మించి ప్రజలతో చీటీలు కట్టించుకుని, సేకరించిన డబ్బులను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో కోట్ల రూపాయల మోసం జరిగినట్లు సమాచారం. డాక్టర్ ఆతశ్రీ ఫిర్యాదుతో విషయం వెలుగులోకి రాగా, పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు