మదనపల్లెలో లారీ అగ్నిప్రమాదం – రూ. 9 లక్షల నష్టం.

0
2

మదనపల్లెలోని బసినికొండ అమీన్ గ్యారేజీలో నిలిపి ఉంచిన లారీలో శుక్రవారం వేకువజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది.

ఈ ఘటనలో లారీ పూర్తిగా దగ్ధమై సుమారు రూ. 9 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అగ్నిమాపక అధికారి శివప్ప తెలిపారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.