రాఘవేంద్ర పాఠశాలలో ఘనంగా 17వ వార్షికోత్సవం

0
6

చీరాల పట్టణంలోని రాఘవేంద్ర హైస్కూల్ నందు 17వ వార్షికొత్సవ వేడుకలు కరస్పాండెంట్ మణికుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నవి ముఖ్య అతిధులుగా బాపట్ల జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి మాధవి,విశిష్ట అతిధులుగా హైస్కూల్ సోషల్ అసిస్టెంట్ రాజు విజయ్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా పాఠశాల సెక్రటరీ కరస్పాండెంట్ గవిని మణికుమార్ మాట్లాడుతూ దుగ్గి వెంకటనారాయణ,సుజాత ,

మిరియాల బసవ పున్నమ్మ, బాబురావు కుమారుడు నాగేంద్ర ఫణికుమారు ” 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రధమ, ద్వితీయ,తృతియా స్థానం సాధించిన వారికి వేరు వేరుగా నగదు పంపిణి చేశారని తెలిపారు.ఈ కార్యక్రమంతో విద్యార్థుల అకడమిక్, క్రమశిక్షణ, క్విజ్,ఆటల పోటీలలో విజయం సాధించినవారికి అతిధులు చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారని,క్రమశిక్షణతో విదనభ్యసించి తల్లిదండ్రులను, గురువులను గౌరవిస్తూ గొప్ప స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో పాఠశాల అడ్వైజర్ ఎన్.పావని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.