విజయ పాల ధరలు పెంపు…లీటరుకు రూ.2, పెరుగు బకెట్లపై రూ.30 వరకు…స్టాండర్డ్ పెరుగు బకెట్ పై రూ.40 పెంపు*
కృష్ణా మిల్క్ యూనియన్ (విజయా డెయిరీ) పాల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏడు ర కాల పాలపై లీటరుకు రూ.2 పెంచారు. పెరుగు బకెట్లపై రూ.10 నుంచి రూ.30 వరకు పెంచారు.
ఒక స్టాండర్డ్ మిల్క్ పెరుగు బకెట్ 10 కేజీలపై రూ.40 పెంచారు. పెంచిన ధరలు ఈనెల 4వ తే దీ నుంచి అమల్లోకి వస్తాయని, నెలవారీ కార్డులు కొన్న వారికి ఏప్రిల్ 9వ తేదీ వరకు పాత ధర లు వర్తిస్తాయని యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు.
నిర్వహణా వ్యయం, బటర్, పౌండర్ ధరలు పెరగటంతో పాటు రైతులకు ఇచ్చే ధరలు పెంచడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ధరలు పెంచాల్సి వచ్చిందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.










