అమరావతికి చట్టబద్ధత: టీడీపీ నాయకుల సంబరాలు.

0
8

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో టీడీపీ నాయకులు గురువారం మంత్రి నారా లోకేశ్ పిలుపు మేరకు కోళ్ల బైళ్ళు పంచాయతీ, 34, 35 వార్డుల నాయకులు రాజధాని అమరావతికి చట్టబద్ధత రావడంతో “గ్రహణం వీడింది” అంటూ సంబరాలు నిర్వహించారు.

సాయంత్రం 7 గంటలకు ఇళ్ల ముందు దీపాలు వెలిగించి, సెల్ఫీలు తీసుకుని #ఏపీ థాంక్స్ ఇండియా హ్యాష్‌ట్యాగ్‌తో షేర్ చేయాలని లోకేశ్ సూచించారని నాయకులు తెలిపారు. ఈ సంబరాలు అమరావతికి చట్టబద్ధత లభించినందుకు కృతజ్ఞతలు తెలియజేసేలా జరిగాయి.