కల్తీ లేని పాలు – రైతుకు మేలు: పాడి పరిశ్రమ అభివృద్ధిపై సీఎం దిశానిర్దేశం.

0
2

ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీ హిల్స్ నివాసంలో జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి బోర్డు చైర్మన్ డాక్టర్ మీనేష్ షా గారు, మదర్ డైరీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌ జయతీర్థ చారి గారు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవలసిన అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు.

 

ఈ సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారు, రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి గారు, మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి గారు, ఇతర అధికారులు పాల్గొన్నారు.