చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లిలో గంగమ్మ జాతర సందర్భంగా ఎనిపోతు ఊరేగింపు ఏప్రిల్ 7, 8 తేదీలలో ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ వేడుకల కోసం గ్రామం పండుగ వాతావరణంలో మునిగిపోయింది.
ఎనిపోతును ప్రత్యేకంగా అలంకరించి, మేళతాళాలు, డప్పుల శబ్దాల నడుమ ఊరేగింపుగా తీసుకెళ్తారు. యువతతో పాటు దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. గ్రామ పెద్దలు ఈ ఉత్సవాలను సమన్వయం చేస్తున్నారు# కొత్తూరు మురళి.










