ముఖ్యనేత పదవికి ఎసరు పెట్టిన ‘నంబర్‌-2’‎సన్నిహితంగా ఉంటూనే పీఠంపై గురి

0
2

నమ్మించి గొంతు కోశారా? – పీఠం కోసం ‘నంబర్-2’ వ్యూహం!

 తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బట్టబయలయ్యాయి. ముఖ్యనేతకు అత్యంత సన్నిహితంగా ఉంటూనే, ఆయన పదవికే ఎసరు పెట్టేలా ఒక కీలక మంత్రి వ్యవహరించడం ఇప్పుడు గాంధీభవన్‌లో హాట్ టాపిక్ అయ్యింది.

  • కాంట్రాక్ట్ చిచ్చు: ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఒక కాంట్రాక్టర్‌కు రూ. 600 కోట్ల పనులు అప్పగించడంపై మొదలైన వివాదం, ఢిల్లీ స్థాయికి చేరింది. తన రాజకీయ ప్రత్యర్థికి అంత పెద్ద పని ఎలా ఇస్తారని సదరు మంత్రి ముఖ్యనేతను నిలదీశారు.

  • ఢిల్లీ లాబీయింగ్: ఢిల్లీ వెళ్లినప్పుడు తనకున్న ఆర్థిక బలంతో హైకమాండ్ పెద్దలను ప్రసన్నం చేసుకున్న మంత్రి, ఏకంగా ముఖ్యనేత పీఠాన్ని లేదా కీలకమైన మున్సిపల్ శాఖను ఆశించినట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. బీహార్ ఎన్నికలకు నిధుల సమీకరణ హామీతో అధిష్టానం వద్ద మంత్రి మార్కులు కొట్టేసినట్లు సమాచారం.

  • ముఖ్యనేత కౌంటర్: తన పీఠం కిందకే నీళ్లు తెచ్చిన మంత్రిని దెబ్బకొట్టేందుకు, అసెంబ్లీలో ప్రతిపక్షం లేవనెత్తిన ఒక అక్రమ వ్యాపారంపై సీబీసీఐడీ విచారణకు ముఖ్యనేత ఆదేశించారు. దీని ద్వారా మంత్రి ‘జుట్టు’ తన చేతిలో ఉంచుకోవాలని భావించినా, సదరు మంత్రి మాత్రం అవేమీ లెక్కచేయకుండా ‘దేఖ్‌లేంగే’ అన్నట్లుగా కేరళకు పయనం కావడం గమనార్హం.