సర్వమానవాళి పాప పరిహారార్థం క్రీస్తు చూపిన త్యాగమార్గమే మోక్షమార్గమని ఆర్.సి.ఎం చర్చి గురువు టీ. కరుణాకర్ పేర్కొన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా వేటపాలెం పురవీధుల్లో యేసుప్రభువు అనుభవించిన శ్రమలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించిన ‘సిలువ మార్గం’ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
40 రోజుల ఉపవాస దీక్షల ముగింపులో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో చీరాల మాజీ ఏఎంసీ చైర్మన్ మార్పు గ్రెగోరి, జె.యం.జె సిస్టర్స్ మరియు ప్రముఖులు పాల్గొన్నారు. మరియ దళం మహిళా సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు భోజన సదుపాయాలు కల్పించారు. జేసునగర్, సిలోన్ కాలనీ సహా పరిసర గ్రామాల క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ధ్యాన వేడుకను విజయవంతం చేశారు.










