అన్నమయ్య జిల్లాలో భారీ స్థాయిలో పోలీసు బదిలీలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 148 మంది పోలీస్ సిబ్బందిని బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ ధీరజ్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ బదిలీల్లో ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, మరియు మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. బదిలీ ఉత్తర్వులు అందిన వారు వెంటనే కొత్త స్థానాల్లో విధుల్లో చేరాలని ఎస్పీ ఆదేశించారు.










