పుంగనూరు నియోజకవర్గం:ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

0
1

పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం పాపిరెడ్డిగారి పల్లిలోని ఎల్లమ్మ తల్లి ఆలయంలో ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా హాజరైన పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పూజల్లో పాల్గొన్నారు.

ఆలయ నిర్వాహకులు దామోదర, మధు, వాసు ఆయనకు స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. మహా మంగళ హారతి అనంతరం ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలను అందజేశారు# కొత్తూరు మురళి.