చిత్తూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం జరిగిన జడ్పీ సమావేశానికి పలువురు అధికారులు గైర్హాజరు కావడంతో వారికి నోటీసులు పంపాలని జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు ఆదేశించారు.
జిల్లాలో యూరియా కొరత లేకుండా చూడాలని, వేరుశెనగ విత్తనాలను సకాలంలో పంపిణీ చేయాలని, మామిడి రైతులకు సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.










