వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో

0
1

పేద దళిత కుటుంబంలో జన్మించి, దళితుల హక్కుల సాధనకు జీవితాంతం పోరాడిన మహానీయుడు, దేశానికి అపార సేవలందించిన మాజీ ఉప ప్రధానమంత్రి కీ.శే. డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించిన ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు మరియు రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి గారువైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఆ మహనీయుని సేవలను స్మరించుకున్నారు.

అణగారిన వర్గాల హక్కుల కోసం అచంచలంగా పోరాడిన మహోన్నత వ్యక్తిత్వం డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారు సామాజిక న్యాయం, సమానత్వం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఆయన, స్వాతంత్ర్య సమరయోధుడిగా, కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా దేశానికి విశేష సేవలందించారు. పార్లమెంట్‌లో దళితుల హక్కుల కోసం గళమెత్తి, భారత రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర వేశారు.

ఆయన ఆశయాలు నేటికీ ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం. ఆయన పోరాట స్ఫూర్తి తరతరాలకు ప్రేరణగా నిలుస్తోంది.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.