మహనీయుల ఆదర్శాలతోనే సమసమాజ నిర్మాణం సాధ్యమని అన్నమయ్య జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి పేర్కొన్నారు. ఆదివారం మదనపల్లి పోలీస్ కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వెంకటాద్రి మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరయోధుడిగా, దళిత బాంధవుడిగా జగ్జీవన్‌రామ్ సేవలు చిరస్మరణీయమని, రాజ్యాంగంలో సామాజిక న్యాయం అందించడంలో ఆయన పాత్ర కీలకమని కొనియాడారు.
పోలీసు సిబ్బంది ఆయనను స్ఫూర్తిగా తీసుకుని కులమతాలకు అతీతంగా సేవలు అందించాలని పిలుపునిచ్చారు.









