ముగ్గుల పోటీలతో మెరిసిన ఎమ్మిగనూరు – ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు.

0
1

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత లభించిన సందర్భంగా తెలుగుమహిళలు ఇళ్ల ముందు రంగోలి ముగ్గులు వేసి అమరావతికి తమ మద్దతును తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ. జయనాగేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు.అమరావతి రాష్ట్ర అభివృద్ధికి కేంద్రబిందువుగా నిలుస్తుందని.

ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు ప్రతీకగా అమరావతి రాజధాని రూపుదిద్దుకుంటోందని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు తెలిపారు. అమరావతి నిర్మాణానికి రైతులు చేసిన త్యాగాలు చిరస్మరణీయమని, రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు.ఇళ్ల ముందు అందంగా ముగ్గులు వేసి అమరావతికి మద్దతు తెలిపిన తెలుగుమహిళలను ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు ప్రత్యేకంగా అభినందించి, వారి ఉత్సాహం రాష్ట్రాభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు మహిళలు పాల్గొన్నారు.