పుంగనూరు నియోజకవర్గం, పులిచర్ల మండలంలో పంటలను ధ్వంసం చేసిన 14 ఏనుగుల గుంపు శనివారం రాత్రి నుంచి తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని నెల్లిచెట్ల సమీపంలో తిష్ట వేసింది. కల్లూరు, పాలెం పంచాయతీల్లో మామిడి చెట్లను ధ్వంసం చేసిన ఈ ఏనుగులు, పాల్యం సమీపంలోని అటవీ సరిహద్దులో ఉన్న సోలార్ విద్యుత్ కంచె కారణంగా అడవిలోకి వెళ్లి నెల్లిచెట్ల వద్దకు చేరుకున్నాయి.
ఆదివారం ఉదయం నుంచి అక్కడే ఉన్న ఏనుగుల నేపథ్యంలో, సమీప ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు# కొత్తూరు మురళి.










