ఆదివారం మదనపల్లి కలెక్టరేట్‌లో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, ఎమ్మెల్యే షాజహాన్ భాష మాట్లాడుతూ, అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా, దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. చిన్నతనం నుంచే ఉన్నత విలువలు కలిగిన జగ్జీవన్ రామ్, మూడు దశాబ్దాల పాటు పార్లమెంటేరియన్‌గా దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని తెలిపారు.










