ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా పార్లమెంట్ ఆమోదం పొందిన అమరావతికి మరో విశిష్ట గుర్తింపు లభించనుంది. రాజధాని హోదాలో అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు, లావాదేవీల సౌలభ్యం కోసం కేంద్ర పోస్టల్ శాఖ అమరావతికి ప్రత్యేక పిన్ కోడ్ (PIN Code) కేటాయించే ప్రక్రియను వేగవంతం చేసింది. దీనితో పాటు ప్రత్యేక ఎస్‌టీడీ (STD)
ఐఎస్‌డీ (ISD) కోడ్‌లు కూడా రానున్నాయి. ఇప్పటివరకు వెలగపూడి కోడ్‌నే వాడుతుండగా, ఇకపై అమరావతి పేరుతోనే సొంత కోడ్ చలామణిలోకి వస్తుంది. అలాగే రాజధానిలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అత్యాధునిక జనరల్ పోస్ట్ ఆఫీస్ (GPO) నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం భూమిని కేటాయించింది. త్వరలోనే ఈ భవన నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.









