ఎమ్మిగనూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మరియు కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
యువ నాయకత్వంతో ఎమ్మిగనూరు నియోజకవర్గ అభివృద్ధి మరియు ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే గారు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా గుర్తింపు పొందారని నాయకులు పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం మరియు ప్రజాసేవ లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆయనకు ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ కర్నూలు పార్లమెంట్ ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ గారు, మండల మరియు పట్టణ కమిటీ సభ్యులు, క్లస్టర్, యూనిట్, బూత్ నాయకులు, వార్డ్ ఇన్‌చార్జీలు, స్థానిక నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










