భార్య మరొకరితో వెళ్లిపోయిందన్న మనస్తాపంతో శ్రీరాములు (35) అనే వ్యక్తి తన కాలును కొడవలితో నరుక్కుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.
ఈ ఘటన ఆదివారం మదనపల్లి మాదినకొండలో జరిగింది. కర్ణాటకకు చెందిన శ్రీరాములు, తన భార్య పవిత్ర నెల రోజుల క్రితం వెళ్లిపోవడంతో తీవ్ర దుఃఖానికి గురయ్యాడు.
అవమాన భారంతో సోదరి ఇంటికి వచ్చిన ఆయన, అడవిలోకి వెళ్లి మద్యం సేవించి, కత్తితో తన ఎడమ కాలును తెగనరుక్కున్నాడు. కేకలు విని స్థానికులు అతడిని జిల్లా ఆసుపత్రికి తరలించారు.









