మదనపల్లెలోని వలసపల్లె వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చౌడేపల్లి మండలం బోయకొండకు చెందిన హరిబాబు (35) తీవ్రంగా గాయపడ్డాడు. వ్యక్తిగత పని నిమిత్తం మదనపల్లెకు వచ్చి
తిరిగి వెళ్తుండగా వేగంగా వచ్చిన ఆటో అతని బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హరిబాబు కాళ్లు, చేతులు విరిగి తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు అతన్ని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు.










