మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని రాజీవ్ వీకర్ సెక్షన్లో ప్రజలు ఎదుర్కొంటున్న పౌర సమస్యలను పరిష్కరించేందుకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా పర్యటించారు.
ఈ పర్యటనలో DC భోగేశ్వర్, SW DE సత్యనారాయణ, SFAలు ఆరిఫ్, హనుమంత్, సాజిద్, ఆదిత్యతో పాటు ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్థానిక నివాసితులు తమ సమస్యలను మాజీ కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా కొత్త చెరువులోని హైసింత్ తొలగించిన తరువాత నీరు ఇళ్లలోకి చేరుతున్న సమస్యపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే స్పందించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి గారు పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించి, సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అలాగే, ప్రాంతంలో పరిశుభ్రతను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ప్రజలకు అవగాహన కల్పించారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా, స్వచ్ఛ ఆటోలు (Swach Autos)కి క్రమం తప్పకుండా ఇవ్వాలని సూచించారు. ప్రజలు సహకరిస్తేనే శుభ్రమైన వాతావరణం సాధ్యమవుతుందని ఆమె తెలిపారు.
#sidhumaroju
Alwal








