ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం-2026కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో, కేంద్ర న్యాయశాఖ అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ సవరణ 2024 జూన్ 2వ తేదీ నుంచే పాత తేదీతో (retrospective effect) అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. దీని ప్రకారం, 2014 చట్టంలోని “కొత్త రాజధాని ఉంటుంది” అనే పదబంధం స్థానంలో “అమరావతి రాజధానిగా ఉంటుంది” అని మార్పు చేశారు. ఈ నిర్ణయంతో అమరావతి ఏపీకి ఏకైక మరియు శాశ్వత రాజధానిగా ఖరారైంది, దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది










