గ్రామగ్రామాన బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి: శరకణం రాజబాబు

0
2

కిర్లంపూడి మండలం గోనేడ గ్రామంలో భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మండల అధ్యక్షుడు శరకణం రాజబాబు ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి కార్యకర్త ఇంటిపైనా బీజేపీ జెండా ఎగరాలని, గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం

చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి చేరువయ్యాయని, ఆయన పాలనలోనే దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల సమాఖ్య అధ్యక్షుడు అల్లు శివరామకృష్ణ మరియు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.