అన్నమయ్య జిల్లా బోయకొండ అటవీ ప్రాంతంలో ఆదివారం రాత్రి మద్యం మత్తులో గాంధీ అనే తమిళనాడు వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధం ఉన్న స్థానికుడు నరసింహులు, గాంధీని బండరాళ్లతో కొట్టి చంపినట్లు సమాచారం. ఈ ఘటనలో గాంధీ నాలుగేళ్ల కుమారుడు సందీప్ రాత్రంతా అడవిలోనే గడిపాడు.
సోమవారం ఉదయం బయటకు వచ్చిన బాలుడిని అంగన్‌వాడీ టీచర్ ప్రశ్నించగా అసలు విషయం వెలుగుచూసింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.










