చౌడేపల్లి మండలం బోయకొండ అటవీ ప్రాంతంలో గాంధీ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. తమిళనాడుకు చెందిన గాంధీ, భార్య రాసతితో కలిసి చౌడేపల్లెలోని కోళ్ల ఫారంలో పనిచేస్తున్నాడు.
రాసతికి స్థానికుడు నరసింహులుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. నిన్న రాత్రి గాంధీ, అతని కుమారుడు సందీప్, నరసింహులు మద్యం సేవించడానికి వెళ్లారు. మత్తులో ఉన్న నరసింహులు గాంధీని బండరాళ్లతో కొట్టి చంపాడు. భయపడిన సందీప్ అడవిలోకి వెళ్లిపోయాడు. ఉదయం బయటకు వచ్చిన సందీప్‌ను అంగన్వాడీ టీచర్ ప్రశ్నించగా ఈ హత్య విషయం వెలుగులోకి వచ్చింది# కొత్తూరు మురళి.










