ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో పాల్గొన్న మంచిర్యాల ఎంమ్మెల్యే

0
1

మంచిర్యాల : ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సీఎం రేవంత్ రెడ్డి కి శ్రీ గూడెం సత్యనారాయణ స్వామి వారి లడ్డు ప్రసాదం అందించారు,ఈ కార్యక్రమంలో తెలంగాణ

రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ,ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు , ప్రభుత్వ సలహాదారులు శ్రీ సుదర్శన్ రెడ్డి , రాజ్యసభ ఎంపీ, సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి , ప్రభుత్వ విప్ లు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, డిసిసి అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు అభిమానులు,పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.