మదనపల్లెలో తన పేరుపై బ్యాంకులో తనఖా పెట్టిన 44.5 గ్రాముల బంగారు ఆభరణాలను, తనకు తెలియకుండా పెద్ద కుమారుడు బ్యాంకు అధికారులతో కుమ్మక్కై ఫోర్జరీ సంతకాలతో తీసుకెళ్లాడని బాధితురాలు రాజేశ్వరి ఆరోపించింది.
ఈ మేరకు ఆమె తన చిన్న కుమారుడు విజయ్‌తో కలిసి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. నగలు తిరిగి ఇప్పించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విన్నవించింది.










