అన్నమయ్య జిల్లాలో నీటి కొరతకు శాశ్వత పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ‘జలధార–జలహారతి’ పేరుతో 100 రోజుల ప్రత్యేక కార్యాచరణను సోమవారం చిన్నమండెం మండలం రెడ్డివారిపల్లి గొలుసుకట్టు చెరువు వద్ద ప్రారంభించారు.
ఈ మిషన్ ద్వారా జూలై 14 వరకు జిల్లాలోని చెరువులు, ఫీడర్ ఛానళ్ల పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో చేపట్టిన పనుల వల్ల భూగర్భ జలాలు 5.6 మీటర్లు పెరిగి, తాగునీటి సమస్య 90% పరిష్కారమైందని కలెక్టర్ తెలిపారు.










