మదనపల్లె: ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు – జేసీ.

0
0

అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ) శివ్ నారాయణ శర్మ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) అర్జీలను నాణ్యతతో, గడువులోపు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

సోమవారం మదనపల్లె కలెక్టరేట్‌లో సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణితో కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 388 అర్జీలు అందాయి. అనారోగ్యంతో ఉన్న భర్తకు పింఛను, కుమారుడి వైద్య సహాయం, రేషన్ కార్డులో పేరు నమోదు వంటి వ్యక్తిగత సమస్యలపై బాధితులు జేసీకి విన్నవించుకున్నారు.