అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (PGRS)లో ఆయన స్వయంగా అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా నడవలేని స్థితిలో ఉన్న వృద్ధుల వద్దకే ఎస్పీ స్వయంగా వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని మానవత్వం చాటుకున్నారు.










