అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ తెలిపిన వివరాల ప్రకారం, గత ఏడాది ఓ న్యాయవాదిని మోసం చేసి రూ.92 లక్షలు కాజేసిన కేసులో కర్ణాటకలోని బళ్లారికి చెందిన విరూపాక్ష (30) అనే నిందితుడిని మదనపల్లెలో సోమవారం అరెస్టు చేశారు. అతని నుంచి రూ.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు ఉన్నారని, వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు. క్లిష్టమైన కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని ఆయన అభినందించారు.










