పిఠాపురం రైల్వే స్టేషన్‌కు మహర్దశ: మోదీ, అశ్విని వైష్ణవ్‌లకు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు.

0
0

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కృషితో పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధికి మోక్షం లభించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‘ కింద పిఠాపురం స్టేషన్ ఆధునీకరణకు రైల్వే శాఖ ₹37.25 కోట్లు మంజూరు చేసింది. గతంలో పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి.

ఆధ్యాత్మిక కేంద్రమైన పిఠాపురం ప్రాముఖ్యతను వివరించి నిధులు కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రానికి పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులతో స్టేషన్ భవనం, ప్లాట్‌ఫారమ్‌లు మరియు ప్రయాణికుల సౌకర్యాలను అత్యాధునికంగా తీర్చిదిద్దనున్నారు.