పుంగనూరు నియోజకవర్గ : చౌడేపల్లిగంగ జాతరకు సర్వం సిద్ధం

0
1

పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండల కేంద్రంలో నడివీధి గంగమ్మ జాతర కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిర్వాహకుల వివరాల ప్రకారం, మంగళవారం రాత్రి అమ్మవారి కళ్యాణం, ఊరేగింపు జరిగి,

నడివీధిలో భక్తుల దర్శనానికి ఉంచబడుతుంది. బుధవారం సాయంత్రం అమ్మవారి జల్ది కార్యక్రమాలు నిర్వహించబడతాయి. భక్తులకు ఎండ వేడిమి నుండి ఉపశమనం కల్పించడానికి చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలను నివారించడానికి పోలీసుల పటిష్ట బందోబస్తు అమలులో ఉంది# కొత్తూరు మురళి.