విజయవాడ రూరల్ మండలం నున్నలో వడగళ్ల వాన – రైతుల్లో ఆందోళన*
విజయవాడ రూరల్ మండలం నున్న ప్రాంతంలో అకస్మాత్తుగా మారిన వాతావరణం రైతులను కలవరపరిచింది. ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన కురవడంతో ఆరబెట్టిన మొక్కజొన్న పంట పూర్తిగా తడిసి రైతులకు నష్టం కలిగించింది.
మధ్యాహ్నం వరకు ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారి గాలులు, వడగళ్లతో కూడిన వర్షం కురవడంతో రైతులు అప్రమత్తం కాలేకపోయారు. దీంతో పొలాల పక్కన ఆరబెట్టిన మొక్కజొన్న పూర్తిగా తడిసి పోయింది… తడిసిన పంటను చూసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
#Avja










