హైదరాబాదులోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం పై వైసీపీ శ్రేణులు దాడికి యత్నించడం తీవ్రంగా ఖండిస్తున్నామని రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు టిటిడి మాజీ పాలకమండలి సభ్యులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా రాయచోటి పట్టణం గాలివీడు రోడ్డులోని టిడిపి కార్యాలయంలో ఆయన మీడియాతో
మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను మీడియా ప్రశ్నిస్తే దాడులకు దిగడం వైసిపి రాక్షస స్వభావాన్ని బయటపెడుతుందని మండిపడ్డారు అమరావతి రాజధాని విషయంలో వైసీపీ ప్రజలను మోసం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి నుంచి వెనక్కి నెట్టారని ఈ అంశంపై మీడియా నిజాలు బయట పెడితే వైసీపీ నేతలు జీర్ణించుకోలేక దౌర్జన్యానికి దిగుతున్నారని తెలిపారు ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగో స్తంభం అని దాని గొంతు నొక్కి ప్రయత్నం చేయడం ప్రారంభించారు వైసీపీకి ఉన్న రౌడీ సంస్కృతి ఈ ఘటనతో మరోసారి బట్టబయలైందని తన సొంత మీడియా ద్వారా ఇతరులపై ఆరోపణలు చేస్తూ తమ తప్పులను ఎత్తి చూపిన వారిపై దాడులకు దిగడం దుర్మార్గమని పేర్కొన్నారు ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తప్పు చేసిన వారు చట్టం నుంచి ఎప్పటికీ తప్పించుకోలేరని హెచ్చరించారు










