కుల వ్యవస్థను రద్దు చేయాలి – భారతీయ అంబేద్కర్ సేన డిమాండ్.

0
0

భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు పీటీఎం శివ ప్రసాద్, భారత ప్రభుత్వం తక్షణమే కుల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం మదనపల్లె ప్రెస్ క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.

కుల వ్యవస్థ వల్ల సామాన్య ప్రజలు ప్రాథమిక హక్కులను కోల్పోతున్నారని, దేశాభివృద్ధికి కుల నిర్మూలన అత్యవసరమని, కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. కొన్ని వర్గాల ఆధిపత్య ధోరణిపై ఆయన ఘాటుగా విమర్శలు గుప్పించారు.