పుంగనూరు నియోజకవర్గం : ఈతకు వెళ్లి మృతి

0
0

పుంగనూరు అగ్నిమాపక కేంద్ర పరిధిలోని చౌడేపల్లి మండలం, పొదలపల్లి గ్రామ సమీపంలో మంగళవారం ఈతకు వెళ్లి బావిలో మునిగిపోయిన చంద్రశేఖర్ రెడ్డి (37) మృతదేహాన్ని అధికారులు వెలికితీశారు.

చౌడేపల్లి ఎస్సై సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న ఇంచార్జ్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సురేష్ బాబు, తాళ్లు మరియు పాతాళ భైరవిని ఉపయోగించి మృతదేహాన్ని బయటకు తీసి అప్పగించారు. ఈ కార్యక్రమంలో సురేష్ బాబు, సుబ్రహ్మణ్యం, లోకేష్ రెడ్డి, ప్రకాష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.