మదనపల్లి: తాళం వేసిన ఇంట్లో చోరీ.

0
0

మదనపల్లె పట్టణంలోని చంద్రా కాలనీలో మంగళవారం సాయంత్రం తాళం వేసిన ఇంట్లో దొంగలు పడి భారీగా నగదు, బంగారాన్ని దోచుకెళ్లారు. బాధితురాలు ఫాతిమా టైలరింగ్ పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఆమె ఇంటికి వచ్చి చూడగా, తాళాలు పగలగొట్టి ఉన్నాయి.

ఇంట్లో దాచిన రూ. లక్షకు పైగా నగదు, బంగారు ఆభరణాలను దొంగలు అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రెండో పట్టణ సీఐ మహ్మద్ రఫీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పగటిపూట జరిగిన ఈ చోరీ స్థానికంగా కలకలం రేపింది.