మాజీ భార్యపై దాడి కేసు: ముగ్గురికి రెండేళ్ల జైలు శిక్ష.

0
0

ఆస్తి కోసం మాజీ భార్య నీలిమ, ఆమె భర్త వెంకటేష్‌పై దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులకు మదనపల్లి 7వ అదనపు జిల్లా కోర్టు మంగళవారం రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.

పుంగనూరుకు చెందిన యేసు, విడాకులు తీసుకున్న తన మాజీ భార్య నీలిమ పేరిట ఉన్న ఆరు ఎకరాల పొలం దక్కించుకోవాలని పథకం వేశాడు. 2022లో తన స్నేహితులు నాగరాజు, మునిరాజాలతో కలిసి దంపతులపై ప్రాణాంతక దాడికి పాల్పడ్డాడు. చౌడేపల్లి పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయగా, నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శ్రీలత శిక్ష ఖరారు చేశారు.