పుంగనూరు పట్టణంలోని 24వ వార్డుకు చెందిన నజమా అనే హార్ట్ స్ట్రోక్ బాధితురాలికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ₹51,000 చెక్కును మంగళవారం అందజేశారు.
పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ చల్లా బాబు ఆదేశాల మేరకు, టీడీపీ నాయకుడు విశ్రాంత డిఎస్పి సుకుమార్ బాబు, 24వ వార్డ్ ఇంచార్జ్ ధర్మతేజ, సులోచన, మైనార్టీ నాయకుడు అఫ్రోజ్ కలిసి ఆమె నివాసంలో ఈ చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు# కొత్తూరు మురళి .










