రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘స్త్రీ-శక్తి’ ఉచిత ప్రయాణ పథకం విజయవంతం కావాలంటే వెంటనే 3000 కొత్త బస్సులు కొనుగోలు చేసి, సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాలని ఎంప్లాయీస్ యూనియన్ (EU) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పలిశెట్టి దామోదరరావు, జి. వి. నరసయ్య డిమాండ్ చేశారు. మంగళవారం మదనపల్లె-1 డిపో ఆవరణలో నిర్వహించిన బహిరంగ సభలో
వారు మాట్లాడుతూ, పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగినా, పాత బస్సులు మరియు సిబ్బంది కొరతతో ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనిఖీ అధికారుల తప్పుడు కేసులు, సిబ్బందిపై దాడులను అరికట్టాలని కోరారు.










